శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (08:25 IST)

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. నేడు అంకురార్పరణ

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. బుధవారం సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. పుట్టమన్ను సేకరించి నవధాన్యాలు విత్తి వేడుకలకు అంకురార్పణ చేస్తారు. 
 
ఈ నెల 15వ తేదీ వరకు వరకు ఉత్సవాలు కొనసాగున్నాయి. గురువారం సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ధ్వజారోహణంతో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకనున్నారు. 
 
గురువారం రాత్రి నిర్వహించనున్న పెదశేష వాహన సేవతో స్వామివారికి వాహన సేవలు ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజులపాటు వివిధ వాహనాలపై శ్రీవారు విహరించనున్నారు.
 
ఈ నెల 15న రాత్రి ధ్వజారోహ‌ణ‌తో బ్రహ్మోత్సవాలు ముగియ‌నున్నాయి. క‌రోనా కార‌ణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల‌ను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు.
 
బ్రహ్మోత్సవాలు ఇలా...
7న ధ్వజారోహ‌ణం, పెద్దశేష వాహ‌న‌సేన‌
8న చిన్నశేష వాహ‌న‌సేవ‌, రాత్రికి హంస వాహ‌న‌సేవ‌
9న సింహ, ముత్యపు పందిరి వాహ‌న‌సేవ‌లు
10న క‌ల్పవృక్ష‌, స‌ర్వభూపాల వాహ‌న సేవ‌లు
11న మోహినీ అవ‌తారం, గ‌రుడ వాహ‌న‌సేవ‌
12న హ‌నుమంత, గ‌జ వాహ‌న‌సేవ‌లు
13న సూర్యప్రభ, చంద్రప్రభ వాహ‌న‌సేవ‌లు
14న స‌ర్వభూపాల‌, అశ్వ వాహ‌న‌సేవ‌లు
15న ప‌ల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం
15న రాత్రి ధ్వజారోహ‌ణ‌