Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేటు ఏజెన్సీకి లడ్డూ కౌంటర్ల నిర్వహణ.. నాణ్యమైన సేవల కోసం..?

Written By సెల్వి
Updated: గురువారం, 1 జులై 2021 (22:54 IST)
తిరుమల అంటేనే అందరికీ శ్రీవారి లడ్డూ ప్రసాదం గుర్తుకు వస్తుంది. ఎన్నో శతాబ్దాల చరిత్ర ఈ లడ్డూకు ఉంది. స్వామి వారికి అత్యంత ప్రీతి పాత్రమైంది కాబట్టే.. ఈ లడ్డూను ఆయనకు నైవేద్యంగా పెడుతారు. లడ్డూ వితరణ, కల్యాణ కట్ట కేంద్రాలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. లడ్డూ కేంద్రంలో కేవీఎం ఇన్ఫోకామ్‌ సంస్థ సేవలు ప్రారంభించింది. ఇప్పటి వరకు పలు బ్యాంకుల ద్వారా లడ్డు విక్రయాలు జరిపేవారు. 
 
నాణ్యమైన సేవలను అందించేందుకే ప్రైవేటు సంస్థకు అప్పగించామని తెలిపారు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి. వీటితో పాటు వైకుంఠం టికెట్ల తనిఖీ కేంద్రం, సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్ల జారీని సైతం ఇకపై ప్రైవేటు ఏజెన్సీలే చేపట్టనున్నాయి. 
 
మరోవైపు…చాలాకాలం తర్వాత తిరుమలలో మళ్లీ భక్తుల సందడి నెలకొంది. కరోనా ఆంక్షల సడలింపులతో శ్రీనివాసుడి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిత్యం 12 నుంచి 18 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుoటున్నారు. అలాగే హుండీ ఆదాయం కూడా పెరుగుతోంది.

అన్నీ చూడండి

తెలంగాణలో ఆటో-రిక్షా ఛార్జీలను పెంచాలి.. కమిటీ సిఫార్సు

గాజువాకలో నీట్ అభ్యర్థి సెర్చ్ చేసి ఆత్మహత్య.. బ్యాగులో మూర్ఛకు ట్యాబ్లెట్లు

కలియుగం.. బీహార్‌లో ఇద్దరు అమ్మాయిల వివాహం.. వీడియో

ఇద్దరు పిల్లలతో గోదావరిలో దూకేసిన దంపతులు.. కారణం ఏంటి?

నవంబర్ నుంచి అన్ని పాఠశాలలకు అల్పాహార పథకం.. తెలంగాణ

అన్నీ చూడండి

05-09-2026 శనివారం దినఫలాలు - ఖర్చులను తగ్గించి పొదుపుపై దృష్టి పెట్టండి...

Janmashtami, మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన చెరసాల చూసారా?, వీడియో

04-09-2026 శుక్రవారం నాటి రాశి ఫలితాలు... ధన వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం..

03-09-2026 గురువారం రాశి ఫలితాలు... కొత్త ప్రాజెక్ట్‌కు అనుకూలమైన రోజు

Nepal flash flood 2026: నేపాల్ వరదలు.. ముందుగానే పలాంచోక్ భగవతి అమ్మవారికి చెమటలు.. హెచ్చరిక? (video)

తర్వాతి కథనం
Show comments