మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: శుక్రవారం, 25 జూన్ 2021 (20:01 IST)

నన్ను కాపాడమని శ్రీవారిని ప్రార్థించా: నవనీత్ కౌర్

తిరుమల శ్రీవారి దర్సించుకున్నారు మహారాష్ట్ర అమరావతి ఎంపి నవనీత్ కౌర్. విఐపి విరామ దర్సనా సమయంలో స్వామిసేవలో ఆమె పాల్గొన్నారు. నవనీత్ కౌర్‌తో ఫోటోలు తీసుకోవడానికి భక్తులు పోటీలు పడ్డారు. సున్నితంగా అందరినీ తిరస్కరిస్తూ నవనీత్ కౌర్ ఆలయం బయట నుంచి కారు ఎక్కి వెళ్ళిపోయారు.
 
అంతకుముందు తిరుమల ఆలయం ముందు మీడియాతో ఆమె మాట్లాడారు. కుల ధృవీకరణ పత్రానికి సంబంధించి కేసు సుప్రీంకోర్టులో నడుస్తుందన్నారు. సుప్రీంకోర్టు ఈ కేసుపై స్టే ఇవ్వడంతో స్వామవారి దర్సనానికి వచ్చినట్లు చెప్పారు.
 
ఆంధ్ర, తెలంగాణా ప్రజలపై తనకు అభిమానం ఉందన్నారు. వారి కోసం ఏమైనా చేయాలన్న తపన ఉందన్నారు. మహారాష్ట్రలో ప్రజల అభిప్రాయాలకు, ఆశయాలకు భిన్నంగా శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. శివసేనపై తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు.