తితిదే ధర్మకర్తల మండలి సభ్యులు వీరేనా?

Updated: గురువారం, 29 ఆగస్టు 2019 (12:02 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ధర్మకర్తల మండలికి కొత్త సభ్యుల నియామకం దాదాపుగా ఖరారైపోయింది. ఇప్పటికే టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని ఏపీ సర్కారు నియమించింది. ఇపుడు ధర్మకర్తల మండలి సభ్యుల పేర్లు ఖరారైనట్టు సమాచారం. 
 
ఇదే అంశంపై పాలకమండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు. ప్రతిపాదనల్లో ఉన్న పేర్లపై చర్చించి తుది జాబితాకు ఆమోదం తెలిపారని సమాచారం. ప్రస్తుతం పాలకమండలి సభ్యుల సంఖ్య 19 ఉండగా.. ఈసంఖ్యను 25కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గవర్నర్‌ ఆమోదముద్ర వేయగానే సభ్యుల పేర్లు వెల్లడించనున్నారు. 
 
కొత్తగా ఎంపికైన సభ్యుల్లో తమిళనాడు నుంచి ఇండియా సిమెంట్స్‌ ఎండీ ఎన్‌.శ్రీనివాసన్‌, కృష్ణమూర్తి, కర్ణాటక నుంచి కృపేందర్‌ రెడ్డి, సుందర్‌, తెలంగాణ నుంచి ముగ్గురుండనున్నారు. పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వర్‌రావు పేరు వినిపిస్తోంది. ఏపీ నుంచి ఎమ్మెల్యేల్లో యూవీ రమణమూర్తి రాజు -యలమంచిలి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి(కాకినాడ) పేర్లు వినిపిస్తున్నాయి. తుడా ఛైర్మన్‌, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పదవిరీత్యా తితిదే పాలకమండలిలో సభ్యుడుగా ఉండనున్నారు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి భార్య ప్రశాంతిరెడ్డి పేరు వినిపిస్తోంది. 

అన్నీ చూడండి

బొద్దింక జనతా పార్టీ నిరసనల్లో అసభ్య పదజాలం ఉపయోగిస్తూ, తాకుతూ కొందరు, వీడియో

విద్యార్థుల ఆందోళనకు స్టాలిన్ మద్దతు - నీట్ రద్దు చేయాలంటూ డిమాండ్

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య

Gudivada: కొడాలి నాని సహాయకుడి బర్త్‌డే పార్టీపై దాడి, మద్యం స్వాధీనం

జూబ్లీహిల్స్ భూవివాదం కేసు : ఇద్దరు సినీ నిర్మాతలపై కేసు

అన్నీ చూడండి

తిరుమల 7వ మైలు వద్ద శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ.. అలా కనిపెట్టేశారు..

23-07-2026 గురువారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

భక్తుల రద్దీ: గురువారం నాటి SSD టోకెన్లను రద్దు చేసిన టీటీడీ

32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ - సింహాచలంలో భారీ ఏర్పాట్లు

22-07-2026 బుధవారం ఫలితాలు - మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది

తర్వాతి కథనం
Show comments