ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. మధుర జ్ఞాపకాలు
Written By pnr
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2017 (09:27 IST)

తల్లితో హనీమూన్ అనుభవాలు పంచుకున్న కుమార్తె.. నెటిజన్లు ఫిదా (Video)

సాధారణంగా పెళ్లి తర్వాత నూతన దంపతులు తమకునచ్చిన చోటుకి హనీమూన్‌కు వెళుతుంటారు. అలా వెళ్లివచ్చాక తమ అనుభవాలను స్నేహితుల వద్ద షేర్ చేసుకుంటారు. అయితే, ఆ యువతి మాత్రం తన హనీమూన్ అనుభవాలను మాత్రం ఏకంగా తల

సాధారణంగా పెళ్లి తర్వాత నూతన దంపతులు తమకునచ్చిన చోటుకి హనీమూన్‌కు వెళుతుంటారు. అలా వెళ్లివచ్చాక తమ అనుభవాలను స్నేహితుల వద్ద షేర్ చేసుకుంటారు. అయితే, ఆ యువతి మాత్రం తన హనీమూన్ అనుభవాలను మాత్రం ఏకంగా తల్లికి వివరించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు వైరల్‌గా మారింది. ఈ వీడియోను 33 లక్షల పైచిలుకు మంది వీక్షించడం గమనార్హం. 
 
ఇటీవల గోవాకు హనీమూన్‌కు వెళ్లొచ్చిన ఓ యువతి తన తల్లితో తన అనుభవాలను ఎలా చేసుకుందో ఈ వీడియోలో చూడొచ్చు. మొత్తం 9 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో త‌ల్లీ కూతుళ్లు సెక్స్, భావ‌ప్రాప్తిలాంటి విష‌యాల‌పై మాట్లాడిన‌ప్ప‌టికీ.. వాళ్ల మాటల‌న్నీ ప‌రోక్షంగానే ఉండటం గమనార్హం. 
 
వంటగదిలో వంట చేస్తున్న త‌న త‌ల్లితో సెక్స్ అనుభ‌వాలను అటువంటి ప‌దాలే ఉప‌యోగించ‌కుండా అన్నీ వంట భాష‌లోనే వివ‌రించిన విధానానికి ఫిదా అయిపోతున్నారు నెటిజ‌న్లు. 'ఖానే మే క్యాహే' అనే పేరుతో వ‌చ్చిన ఈ షార్ట్ మూవీ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌డావుడి చేస్తున్న‌ది.