Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్ల్ ఫ్రెండ్‌తో అలా కావాలనీ...

Updated: శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (22:33 IST)
పురుషులు ఏం కోరుకుంటారు...? అదే రొమాన్స్ విషయంలో... తమకు నచ్చిన స్త్రీతో రొమాన్స్ చేయాలని చాలామంది పురుషులు కోరుకుంటారట. కోరుకోవడమే కాదు ఆమెను ఎలా ప్రసన్నం చేసుకోవాలా...? అని తెగ ఆలోచిస్తారట. ఇందుకోసం ఏదో వంకతో తొలి పరిచయం పెంచుకుంటారు. అలా మొదలైన పరిచయాన్ని క్రమంగా శృంగారం వైపుకు మరలించేందుకు చూస్తారు. అయితే ఆ ప్రతిపాదనను సదరు మహిళ నిర్మొహమాటంగా తిరస్కరిస్తే... ఏం జరుగుతుందీ...?
 
వద్దన్నా, కాదన్నా ఇక ఆ మగపురుషుడు సదరు మహిళ చుట్టూ ఓ దీపపు పురుగులా తిరుగుతూనే ఉంటాడు. కాళ్లావేళ్లా పడి ఎలాగైనా ఒప్పించేందుకు నానా తంటాలు పడతాడు. ఆమె తను ఉన్న ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్లేంతవరకూ వదలడు. ఒకవేళ అలా వెళ్లిపోయినా ఆమె వివరాలు సేకరించి మళ్లీ ఆమె జీవితంలో ప్రవేశించడానికి సిద్ధమవుతాడు. 
 
దీనికి వెనుక కొన్ని కారణాలున్నాయంటున్నారు నిపుణులు. కొందరు మగాళ్లు తమకు నచ్చిన స్త్రీలతో ఎలాగైనా రొమాన్స్ చేయాలని కోరుకుంటారట. అందులో భాగంగానే తొలుత పరిచయం చేసుకుని, దానిని మరింత పెంచి, బాగా సన్నిహితమైన తర్వాత రొమాన్స్ విన్నపం ఆమె ముందుంచుతాడట. అతడి విన్నపాన్ని సదరు మహిళ ఒప్పుకుంటే, ఇక రొమాన్స్ రొటీన్. కాదంటేనే... ప్రశ్న. ఆమెను వదలక వెంటాడటానికి సిద్ధపడతాడు. 
 
కారణం...రొమాన్స్ చేయడం ఇష్టం లేదని ఖరాఖండిగా చెప్పడంలో కొందరు మహిళలు విఫలమవుతుండటమే. ఎందుకంటే, అప్పటివరకూ ఎంతో స్నేహంగా మసలిన సదరు బాయ్‌ఫ్రెండ్‌తో మందలింపు ధోరణిలో కాక చాలా సౌమ్యంగా "రొమాన్స్ ఇష్టం లేదు" అని చెపుతారట. ఈ మెతక వైఖరిని ఆసరా చేసుకున్న మగాడు ఎలాగైనా ఆమెను శృంగారంలోకి దింపాలని ప్రయత్నాలు చేస్తాడట. 
 
కనుక పరిచయం కాస్తా రొమాంటిక్ దిశగా సాగుతున్నదని అనుమానం వచ్చినప్పుడే అతడితో నిర్మొహమాటంగా, కుండ బద్ధలు కొట్టినట్లు "నో" అని చెప్పినప్పుడు ఈ పరిస్థితి దాపురించే అవకాశం లేదంటున్నారు నిపుణులు. అయితే రొమాన్స్‌కి వివాహం కానివారు, అయినవారు అనే భేదం లేదనీ, అది ఎప్పుడైనా.. ఎవరిలోనైనా కలుగవచ్చని అంటున్నారు. ఈ డేంజరస్ రొమాంటిక్ ఫ్రేమ్ నుంచి తప్పుకోవాలంటే, సదరు పురుషుని ప్రవర్తన ఎలా ఉన్నదో ఒక్కసారి చూసుకుని స్నేహానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటున్నారు.

అన్నీ చూడండి

నేపాల్‌ వరద విపత్తు : వెయ్యి దాటిన మృతుల సంఖ్య

సాయన్నను రెస్ట్ రూమ్‌కు లాక్కెళ్లి చొక్కాపట్టుకుని కొట్టారు : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Video)

మేట్టూరు డ్యామ్‌‌ను ప్రారంభించిన సీఎం విజయ్.. బామ్మతో విజయ్ క్యూట్ వీడియో

ఎలాగూ చేసుకున్నావుగా, ఇంకేం చేస్తాం ఇంటికిరా అల్లుడూ అని చెప్పి హత్య చేసారు

మహిళలకు మరో శుభవార్త.. ఏసీ బస్సులలో సైతం మహిళలకు ఉచిత ప్రయాణం

అన్నీ చూడండి

Mamitha Baiju: అరుదైన మైలురాయిని అందుకున్న హీరోయిన్ మమితా బైజు

Anand Devarakonda: ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నాలుగో పాటగా ‘సబ్‌కో’ విడుదల

రాజ‌మౌళి నిర్మాణంలో ఫాంటసీ చిత్రం డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ డేట్ ఫిక్స్

Sprit: హైదరాబాద్ లో ప్రభాస్ చిత్రం స్పిరిట్ షూట్ కు కారణం చెప్పిన నిర్మాత

మారిన ప్రేక్షకుల ట్రెండ్ అండ్ మూడ్ - హీరో ఫస్ట్ నుంచి డైరెక్టర్ ఫస్ట్ : రానా దగ్గుబాటి

తర్వాతి కథనం
Show comments