గురువారం, 12 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 11 మార్చి 2016 (15:20 IST)

బాహుబలి కట్టప్పపై రాధారవి ఆగ్రహం ఎందుకు..? సత్యరాజ్ ఏం చేశారు..?

బాహుబలికి తమిళ కేటగిరిలో అవార్డులా? ఏంటిది? రాధారవి ప్రశ్న

బాహుబలిపై తమిళ నటుడు రాధారవి గుర్రుగా ఉన్నాడు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు సంపాదించిపెట్టిన బాహుబలికి ఐఫా ఉత్సవాల్లో అవార్డులు దక్కాయి. హైదరాబాదులో ఈ వేడుక ఘనంగా జరిగింది. అయితే ఆ వేడుకలలో తెలుగు కేటగిరిలోనే కాకుండా తమిళ కేటగిరిలో కూడా బాహుబలికి అవార్డులు వచ్చాయి. 
 
తమిళంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన రాధారవికి రావాల్సిన అవార్డు కూడా బాహుబలి కట్టప్ప ఎగరేసుకుపోయాడు. ఓ తెలుగు సినిమాకు తమిళ కేటగిరి‌లో అవార్డులు ఇవ్వడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఈ వేడుకలలో తెలుగు కేటగిరిలోనే కాకుండా తమిళ కేటగిరిలో కూడా బాహుబలికి అవార్డులు వచ్చాయి.
 
ఒక తెలుగు సినిమాకు తమిళ కేటగిరిలో అవార్డ్ ఇవ్వడం వల్ల మాలాంటి వాళ్ళకు అన్యాయం జరిగిందని రాధారవి ఆరోపిస్తున్నారు. రాధారవి తాజాగా ‘‘పిశాచి’’ అనే సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించాడు. ఆ పాత్రకు తప్పకుండా తనకు అవార్డ్ వస్తుందని ఆశించాడు. కానీ ఆ అవార్డు కాస్త బాహుబలి కట్టప్ప సత్యరాజ్ సొంతం చేసుకోవడంపై రాధారవి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.