మంగళవారం, 14 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 9 డిశెంబరు 2024 (16:56 IST)

winter health కండరాలు నొప్పులు, పట్టేయడం ఎందుకు?

Muscle
కండరాలు పట్టడం, కాలి మడాల నొప్పి రావడం ఈమధ్య కాలంలో సర్వసాధారణమైనది. రాత్రిపూట నిద్రపోతున్న సమయంలో, మెళకువలో కూడా ఉన్నట్టుండి తొడలు, కాలిపిక్కలు పట్టేయడం జరుగుతుంది. ఈ సమస్య నుంచి అధిగమించడం ఎలాగో తెలుసుకుందాము.
 
కండరాలు పట్టేయడానికి కారణం రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం, థైరాయిడ్ సమస్య వంటివి.
సరిగా నిద్ర లేకపోయినా, మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్, కండరాల మీద ఒత్తిడి పెరగి ఇలా జరుగుతుంది. 
శరీరంలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం తగ్గటం వల్ల కూడా ఇలా జరుగుతుంది.
కండరాలు పట్టకుండా వుండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
ప్రతిరోజు రెండు పూటలా పాలు త్రాగాలి.
ఎప్సెమ్ సాల్ట్ కలిపిన నీళ్లతో స్నానం చేస్తే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
వీలైనంత ఎక్కువ నీరు, 10 నుంచి 12 గ్లాసులు తీసుకోవాలి.
ఏదైన ఆయిల్ తీసుకొని మసాజ్ చేయడం వల్ల ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.