శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 జులై 2024 (19:09 IST)

13 ఏళ్ల బాలికకు గుండె మార్పిడి.. కేరళ వైద్యులు అదుర్స్

operation
కేరళలోని వైద్యుల బృందం ఐదు గంటల పాటు గుండె మార్పిడి ఆపరేషన్‌ను నిర్వహించి, తీవ్రమైన కార్డియోమయోపతి, గుండె కండరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న 13 ఏళ్ల బాలికకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. వివరాల్లోకి వెళితే.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్‌టి) ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ అయిన శ్రీ చిత్ర తిరునల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలో ఈ ప్రక్రియ జరిగింది. 
 
బాలిక రెండు నెలల పాటు వెంటిలేటర్‌.. ఐసీయూకి పరిమితమైంది. కేరళ స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ దాత హృదయాన్ని అందించాురు. కిమ్స్ హెల్త్ హాస్పిటల్‌లో ఇంట్రాక్రానియల్ అనూరిజం పగిలిపోవడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించిన 47 ఏళ్ల పాఠశాల ఉపాధ్యాయుడి నుండి ఈ అవయవం వచ్చింది. 
 
అవయవాన్ని వేగంగా రవాణా చేసేందుకు కేరళ పోలీసులు గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. కార్డియోవాస్కులర్ - థొరాసిక్ సర్జరీ విభాగానికి చెందిన బైజు ఎస్ ధరన్ నేతృత్వంలోని మల్టీడిసిప్లినరీ బృందం సంక్లిష్ట ఆపరేషన్‌ను నిర్వహించింది. ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. దీంతో బాలిక తల్లిదండ్రులు, ప్రజలు వైద్య బృందాన్ని ప్రశంసిస్తున్నారు.