Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి రోజున పితృదేవతల పూజ.. గుమ్మడికాయ దానం..?

Updated: సోమవారం, 14 జనవరి 2019 (18:09 IST)
సంక్రాంతి రోజున పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం మరిచిపోకూడదు. పితృ సంతృప్తి కోసం కొత్త బట్టలు సమర్పించడం.. బెల్లం, గుమ్మడి కాయలు దానమివ్వడం చేయాలి. సంక్రాంతి రోజు ఇంటి ముంగిట రంగవల్లికలు మెరిసిపోవాలి. రథం ముగ్గు వేయడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి.


దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే వేళ, పుష్య మాసాన సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే తరుణంలో వచ్చే పండుగ ''సంక్రాంతి'' అంటారు. ఇది మూడు రోజుల పండుగ. 
 
సంక్రాంతి రోజున స్వర్గ వాకిళ్లు తెరుస్తారని విశ్వాసం. ఈ రోజు నువ్వులను తమ ఆరాధ్య దేవతలకు నైవేద్యంగా పెడితే, శుభం కలుగుతుందనే నమ్మకం వుంది. సంక్రాంతి సందర్భంగా పలువురు మహిళలు నోములు కూడా నోచుకుంటారు. బొమ్మల నోము, గొబ్బి గౌరీవ్రతం, గోదాదేవి నోములు నోయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. సాధారణంగా 12 రాశుల్లో సూర్యుడు నెలకొక రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తే.. ఆ రాశిని సంక్రాంతిగా పరిగణిస్తారు. 
 
ఆ విధంగా సంవత్సరానికి 12 సంక్రాంతులు ఉంటాయి. కానీ సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు దానిని ''మకర సంక్రాంతి''అంటారు. ఈ మకర సంక్రాంతి రోజున సూర్యదేవునిని పూజించే వారికి సకల శుభాలు చేకూరుతాయి. అలాగే భోగి, సంక్రాంతికి తర్వాత మూడో రోజు కనుమ పండుగను పశువుల పండుగగా జరుపుకుంటారు. పశువులను శుభ్రం చేసి.. పసుపు కుంకుమలతో, పువ్వులతో అలంకరిస్తారు. పశువులను పూజిస్తారు.

అన్నీ చూడండి

ఆగస్టు 20, 2026న తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

అంకుసాపూర్‌.. జిల్లాలో తొలి బాల్యవివాహ రహిత గ్రామం

ఘజియాబాద్‌లో వింత ఘటన.. పిల్లి అడ్డువచ్చిందని అమ్మాయి ఎగిరిపడిందా..? లేకుంటే? (video)

తండ్రికి తలకొరివి పెట్టిన పెద్ద కుమార్తె.. కుమారుడు ఏమయ్యాడంటే? (Video)

నోయిడా యువతి కథ.. పూణేలో హోటల్ రిసెప్షన్‌లో ఉద్యోగం.. కానీ ఓనర్‌కు దగ్గరై అలా దొరికిపోయింది..?

అన్నీ చూడండి

20-08-2026 గురువారం నాటి మీ రాశి ఫలితాలు - మీ ఓర్పుకు పరీక్షా సమయం

వరలక్ష్మీ వ్రతం 2026: ఆగస్టు 21, శుక్రవారం నాడు ఇలా పూజిస్తే..?

19-08-2026 బుధవారం నాటి మీ రాశి ఫలితాలు - దంపతుల మధ్య స్వల్ప కలహం

శ్రావణ మంగళవారం రోజున ఇలా పూజిస్తే.. సర్వం శుభమే

18-08-2026 మంగళవారం నాటి మీ రాశి ఫలితాలు - కష్టించినా ఫలితం శూన్యం

తర్వాతి కథనం
Show comments