ఆదివారం, 3 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 అక్టోబరు 2022 (08:21 IST)

ఇండోనేషియాలో ఘోరం.. స్టేడియంలో తొక్కిసలాట - 127 మంది మృతి

indonesia stampede
ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్సులోని మలాంగ్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 127 మంది చనిపోయారు. మృతుల్లో పోలీసులు కూడా ఉన్నారు. మరో 180 మంది తీవ్రంగా గాయపడ్డారు.
 
ఓడిన జట్టుకు చెందిన అభిమానులు మైదానంలోకి ఒక్కసారిగా దూసుకెళ్లారు. పైగా, ఇరు వర్గాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో అనేక మంది అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఇది తొక్కిసలాటకు దారితీసింది. 
 
మలాంగ్‌లో జరిగిన ఈ ఫుట్‌బాల్ మ్యాచ్ అనంతరం అభిమానులు మైదానంలో చొచ్చుకుని వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్  చేస్తున్నాయి. 
 
ఈ మ్యాచ్‌లో పెర్సెబయి జట్టు 3-2 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం జరిగిన తొక్కిసలాటతో మరో వారం రోజుల పాటు ప్రముఖ లీగ్ బీఆర్ఐ లీగ్ 1 టోర్నీ మ్యాచ్‌లను నిషేధించింది. 
 
మరోవైపు, ఈ తొక్కిసలాట ఘటనపై ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండోనేషియా విచారణకు ఆదేశించింది. ఇదిలావుంటే, ఇండోనేషియాలో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా మారిన విషయం తెల్సిందే.