శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 జూన్ 2021 (13:41 IST)

జాతీయ గీతం అంటే లెక్కలేదు.. ఆమెను ఒలింపిక్స్‌కు పంపకండి..!

Gwen Berry
జాతీయ గీతం అంటే ఆ క్రీడాకారిణికి లెక్కే లేదు. హామర్‌ థ్రో క్రీడాకారిణిగా ఒలింపిక్స్‌కు వెళ్లబోతున్న గ్వెన్‌ బెర్రీని అడ్డుకోండి అంటూ ఫిర్యాదులు అందాయి. వివరాల్లోకి వెళితే.. శనివారం నాడు యూఎస్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఒలింపిక్‌ ట్రయల్స్‌ జరిగాయి. హమర్‌ థ్రో విభాగంలో మూడో ప్లేస్‌లో నిలిచింది 32 ఏళ్ల గ్వెన్‌ బెర్రీ. ఆపై మెడల్స్‌ బహుకరణ తర్వాత.. జాతీయ గీతం ప్రదర్శించిన టైంలో పోడియం వద్ద ఆమె తలబిరుసు ప్రదర్శించింది. 
 
ఆ టైంలో ఆమె మిగతా ఆటగాళ్లకు వ్యతిరేక దిశలో నిలబడింది. పైగా ఏ మాత్రం గౌరవం లేకుండా.. నడుం మీద చెయ్యి వేసుకుంది. జాతీయ గీతం అంటే ఏ మాత్రం పట్టనట్లుగా వ్యవహరించింది. అంతకు ముందు నెత్తి మీద నల్ల గుడ్డతో నిరసన కూడా వ్యక్తం చేసింది. అందుకే ఆమె మీద అమెరికన్లు మండిపడుతున్నారు.
 
దీనిపై బెర్రీ వివరణ ఇచ్చుకుంది. ఐదు నిమిషాలు తమను ఎండలో ఎదురుచూసేలా చేశారని, అందుకే అలా చేశానని చెప్పింది. ఇక బెర్రీ చేష్టలపై దుమారం చెలరేగింది. రాజకీయ నేతలంతా ఆమెపై విరుచుకుపడ్డారు.
 
మరోవైపు శాంతియుత నిరసన ప్రదర్శన కావడంతో వైట్‌ హౌజ్‌ కూడా ఆమె తప్పును మన్నించినట్లు ప్రకటించింది. అయినా విమర్శలు మాత్రం ఆగట్లేదు. ఆమెను ఒలింపిక్స్‌కు వెల్లనీయకుండా అడ్డుకోవాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ యూఎస్‌ ఒలింపిక్స్‌ కమిటీకి పలువురు మెయిల్స్‌ పెడుతున్నారు.