బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 డిశెంబరు 2024 (09:58 IST)

మెన్స్ జూ.ఆసియా కప్.. భారత్ హ్యాట్రిక్

Indian Hockey Team
India 5th Title In Men's Junior Asia Cup Hockey మస్కట్ వేదికగా జరిగిన పురుషుల జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత్ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. 5-3 గోల్స్ తేడాతో మట్టి కరిపిచింది. దీంతో వరుసగా మూడోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా భారత్ ఈ టైటిల్ గెలవడం ఐదోసారి కావడం గమనార్హం. భారత్ తరపున ఆర్జీత్ సింగ్ నాలుగు, దిల్ రాజ్ సింగ్ ఒక గోల్ కొట్టారు. 
 
భారత్ మొదటిసారి 2004లో మెన్స్ జూనియర్ ఆసియా కప్ టైటిల్‌ను గెలిచింది. ఆ తర్వాత 2008, 2015, 2023,. 2024లో ఈ ట్రోఫీని కైవసం చేసుకుంద. దీంతో ఇప్పటివరకు అత్యధిసార్లు ఈ టైటిల్‌ను గెలిచిన జట్టుగా భారత్ నిలిచింది. భారత్ తర్వాత పాకిస్థాన్ జట్టు మూడుసార్లు ఈ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 
 
మరోవైపు, ఈ ట్రోఫీ గెలిచిన సందర్భంగా ఆటగాళ్లు, సిబ్బందికి హాకీ ఇండియా నగదు బహుమతిన ప్రకటించింది. ఒక్కో ఒటగాడికి రూ.2 లక్షలు, అలాగే, సిబ్బందికి రూ.లక్ష చొప్పున రివార్డు ఇవ్వనున్నట్టు తెలిపింది.