పోరాడి ఓడిన మహిళల హాకీ జట్టు.. పతకం ఆశలు మాయం
టోక్యో ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో భాగంగా శుక్రవారం హాకీ విభాగంలో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా హాకీ జట్టు ఓటమిపాలైంది. కొద్దిసేపటి క్రితం గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-4 తేడాతో ఓటమి పాలయ్యారు.
దీంతో హాకీలో భారత్‌కు మరో పతకం వస్తుందన్న అభిమానుల ఆశలు అడియాసలయ్యాయి. నిజానికి రెండో క్వార్టర్‌లో భారత జట్టే అధిక్యంలో ఉన్నప్పటికీ చివరల్లో డిఫెన్స్‌పై పట్టుతప్పడంతో బ్రిటన్ వరుస గోల్స్ చేసి విజయాన్ని అందుకుంది. అయినప్పటికీ చివరి వరకు పోరాడిన భారతజట్టు త్రుటిలో పతకాన్ని చేజార్జుకుంది.