మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 సెప్టెంబరు 2021 (12:52 IST)

నీరజ్ చోప్రా రీచ్ 41.2 కోట్లకు చేరింది.. సో.మీ విలువ రూ.428 కోట్లు!

తాజాగా టోక్యో 2020 ఒలింపిక్స్ గేమ్స్ జరిగాయి. అందులో భారత్ తన సత్తా చాటింది. భారత్ తరపున నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించాడు. అందుకే ఈ మధ్యకాలంలో నీరజ్ చోప్రా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన గురించి ఒలింపిక్స్ ముందు ఎవ్వరికీ అంతగా తెలీదు. 
 
అయితే ఇప్పుడు పసిడి పతకం సాధించడంతో నీరజ్ చోప్రా హీరో అయ్యాడనే అనిపిస్తోంది. రోజురోజుకూ ఆయన పాపులారిటీ పెరుగుతూ వస్తోంది. ఈయన ఫాలోయింగ్ తో అటు క్రికెటర్లను, సెలబ్రిటీలను డిజిటల్ మీడియాలో వెనక్కి నెట్టి ముందుకు దూసుకుపోతున్నాడు. గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత నీరజ్ ఫాలోయింగ్ లో బాగా పెరిగింది. దీంతో నీరజ్ చోప్రా క్రికెటర్లను దాటి ముందు వరుసలో ఉన్నాడనే చెప్పాలి.
 
బయటే కాదు సోషల్, డిజిటల్ మీడియాల్లో కూడా నీరజ్ చోప్రా పేరు బాగా వినిపిస్తోంది. టోక్యో ఒలింపిక్స్ సందర్బంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ప్రస్తావించిన అథ్లెట్ గా నీరజ్ చోప్రా రికార్డు నెలకొల్పాడు. ఒలింపిక్స్ సమయంలో మొత్తం 14 లక్షల మంది 29 లక్షలసార్లు ఇన్‌స్టాగ్రామ్‌లో నీరజ్ చోప్రా పేరును ప్రస్తావించారు. ఆన్‌లైన్‌లో నీరజ్ చోప్రా పేరు ప్రస్తావించిన రేటు 2055 శాతం పెరిగినట్లు యుగోవ్ స్పోర్ట్ అనే కన్సల్టెన్సీ సర్వేలో తేలింది. 
 
ఒలింపిక్స్ పతకం గెలుపొందడంతో సోషల్, డిజిటల్ మీడియాలో నీరజ్ చోప్రా రీచ్ 41.2 కోట్లకు చేరడంతో ప్రస్తుతం ఆయన సోషల్ మీడియా విలువ రూ.428 కోట్లకు పెరిగింది. నీరజ్ చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 45 లక్షలకు ఉండగా గోల్డ్ గెలిచిన తర్వాత ఫాలోవర్ల సంఖ్య 2297 రెట్లు పెరిగిపోయింది.