శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 జులై 2022 (12:46 IST)

సింగపూ‌ర్ ఓపెన్ టైటిల్ విజేత పీవీ సింధు

pv sindhu
భారత బ్యాడ్మింటన్ స్టార పీవీ సింధు మరో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. సింగపూర్‌ ఓపెన్ టైటిల్‌లో ఫైనల్ పోటీలో విజయం సాధించి సింగపూర్ విజేతగా నిలించింది. ఆదివారం ఉదయం జరిగిన టైటిల్ పోరులో ఆమె చైనాకు చెందిన వ్యాంగ్ జీ ఈని మట్టికరిపిచి విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో 21-9, 11-21స 21-15 స్కోరుతో సింధూ ఫైనల్‌లో ఫైనల్‌లో విజయం సాధించింది. 
 
ఈ యేడాదిలో ఇప్పటికే రెండు టైటిళ్లను నెగ్గిన పీవీ సింధు తాజాగా సింగపూర్‌ ఓపెన్‌ టైటిల్‌తో కలిపి మొత్తం మూడు టైటిళ్ళను తన ఖాతాలో వేసుకుంది. మొన్న క్వార్టర్స్ చైరిన సింధు సేమీస్‌కు కూడా ఈజీగానే నిలిచింది. అయితే, ఫైనల్ మ్యాచ్‌లో తొలి సెట్‌ను అలవోకగా గెలిచిన సింధు తన ప్రత్యర్థిని ఏమాత్రం కోలుకోకుండా మెరుపుదాడి చేసిన ఓడించింది.