మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 డిశెంబరు 2024 (13:36 IST)

PV Sindhu weds Venkat Dutta Sai వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన పీవీ సింధు

PV Sindhu weds Venkat Dutta Sai
PV Sindhu weds Venkat Dutta Sai భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో ఆదివారం రాత్రి 11.20 గంటలకు ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పోసిడెక్స్ టెక్నాలజీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయితో కలిసి ఆమె ఏడు అడుగులు నడిచారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు సమాచారం. 
 
కర్టెసి-ట్విట్టర్
రాజస్థాన్‌లోని ఉదయ్‌ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్ ఈ పెళ్లి ఘట్టానికి వేదికగా నిలిచింది. పెళ్ళి ఫోటోలు మాత్రం  రెండు కుటుంబ సభ్యులు ఇంకా విడుదల చేయలేదు. కాగా, మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో పీవీ సింధు కపుల్స్ రిసెప్షన్ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా, ఈ వేడుకకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు.