శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 అక్టోబరు 2022 (15:46 IST)

వివాదంలో సిమోనా హలెప్.. ఉత్ర్పేరకాలు వాడింది.. ప్రమాదంలో కెరీర్

Simona Halep
Simona Halep
రొమేనియా టెన్నిస్ స్టార్, ప్రపంచ మాజీ నెంబర్ వన్ క్రీడాకారిణి సిమోనా హలెప్ వివాదంలో చిక్కుకుంది. నిషేధిత ఉత్ర్పేరకాలు వాడినందుకు ఆమె కెరీర్ ప్రమాదంలో పడింది. అంతర్జాతీయ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజేన్సీ (ఐటీఐఏ) ఆమెపై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. 
 
ఈ ఏడాది న్యూయార్క్‌లో జరిగిన యూఎస్ ఓపెన్ సమయంలో హలెప్ నుంచి సేకరించిన రెండు శాంపిల్స్‌ను పరీక్షించి ఆమె డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు గుర్తించారు. ఆమె శాంపిల్స్‌లో రోక్సాడుస్టాట్ అనే డ్రగ్ ఉన్నట్టు తేలింది. ఈ డ్రగ్ ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ నిషేధిత జాబితాలో ఉంది. 
 
శాంపిల్‌లో చాలా తక్కువ పరిణామంలో డ్రగ్ ఉండటంతో హలెప్‌పై ప్రస్తుతానికి ప్రాథమిక నిషేధం మాత్రమే విధించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పింది.