బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 మార్చి 2018 (13:33 IST)

అరుణా రెడ్డికి రైల్వే ఉద్యోగం.. రూ.2 కోట్ల నగదు

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్ పోటీల్లో హైద‌రాబాద్‌కు చెందిన అథ్లెట్ అరుణా రెడ్డి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. దీంతో ఆమెకు రైల్వే ఉద్యోగం లభించింది. గ్రూప్ 'సి' కేటగిర

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్ పోటీల్లో హైద‌రాబాద్‌కు చెందిన అథ్లెట్ అరుణా రెడ్డి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. దీంతో ఆమెకు రైల్వే ఉద్యోగం లభించింది. గ్రూప్ 'సి' కేటగిరీలో ఆమెకు రైల్వే ఉద్యోగం ఇస్తున్న‌ట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 
 
మరోవైపు, అరుణా రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నగదు బహుమతి ప్రకటించిన విషయం తెల్సిందే. ఈనెల 4వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రూ.2 కోట్ల ప్రోత్సాహక నగదు బహుమతిని ప్రకటించారు. దేశ గౌరవాన్ని పెంపొందించేలా చేసిన తెలంగాణ బిడ్డను అభినందించారు.