బోపన్న - నేను మాట్లాడుకోలేదు... అందుకే మొబైల్ స్విచాఫ్ చేశా : సానియా మీర్జా
రియో ఒలింపిక్స్ క్రీడల్లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తృటిలో పతకం చేజార్చుకున్న సానియా మీర్జా... ఆ ఓటమిపై ఇపుడు స్పందించింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత తాను, రోహన్ బోపన్న అనుభవించిన వేదన అంతాఇంతా కాద
రియో ఒలింపిక్స్ క్రీడల్లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తృటిలో పతకం చేజార్చుకున్న సానియా మీర్జా... ఆ ఓటమిపై ఇపుడు స్పందించింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత తాను, రోహన్ బోపన్న అనుభవించిన వేదన అంతాఇంతా కాదని పేర్కొంది.
తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పతక పోరు ముగిసిన రెండు గంటల్లోనే తాను, బోపన్న కలిసి సిన్సినాటి టోర్నీకి బయలుదేరామని, తామిద్దరం సుమారు గంట పాటు ఒక్కమాట కూడా మాట్లాడుకోలేదని, తన మొబైల్‌ను కూడా స్విచ్చాఫ్ చేశానని వెల్లడించింది. ఓటమి తర్వాత వర్ణించలేనంత బాధను అనుభవించామని చెప్పుకొచ్చింది.
ఒలింపిక్స్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయి ఉంటే అంతగా బాధపడి ఉండేవాళ్లం కాదని, కానీ తృటిలో పతకాన్ని చేజార్చుకోవడంతో తన గుండె పగిలినట్టు అయిందని తెలిపింది. ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంతో సరిపెట్టుకోవడం కూడా చిన్న విషయమేమీ కాదని పేర్కొంది.
లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం తమను బాధించింది. పోరు ముగిశాక క్రీడా గ్రామం నుంచి విమానాశ్రయానికి వెళ్లడానికి 1:15 గంటలు పట్టిందని, ఆ సమయంలో ఒకటి రెండు మాటలు తప్పితే పెద్దగా మాట్లాడుకోలేదని తెలిపింది. పేర్కొంది. ‘‘బాధపడకు, వచ్చేసారి చూద్దాం’’ వంటి సందేశాలు తనకు ఇష్టముండదని, అందుకే సెల్ స్విచ్చాఫ్ చేశానని వివరించింది.