ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 జనవరి 2025 (12:05 IST)

రాజేంద్ర నగర్‌లో చిరుతపులి కలకలం!

Leopard_Cat
హైదరాబాద్ నగరంలో మరోమారు చిరుత కలకలం సృష్టంచింది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆదివారం మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఈ చిరుత కంటపడింది. దీంతో వాకింగ్ చేస్తున్న వారు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్రికల్చర్ యూనివర్శిటీ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు వచ్చిన చిరుత అక్కడ నుంచి చెట్ల పొదల్లోకి వెల్లిపోయినట్టు వాకర్స్ చెప్పారు. చిరుత పాద ముద్రలను గుర్తించిన వాకర్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. 
 
కాగా, ఈ విషయం తెలిసిన విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్ర నగర్‌లో గతంలో కూడా చిరుత సంచారం కలకలం రేపింది. నాలుగేళ్ల క్రితం హిమాయత్ సాగర్‌ వాలంటరీ రీసెర్స్ వ్యూమ్ హౌస్ సమీపంలో ఆవులపై చిరుత దాడి చేసిన విషయం తెల్సిందే. ఒక ఆవు దూడను చిరుత చంపడం అప్పట్లో తీవ్ర కలకలాన్ని సృష్టించింది. ఇపుడు ఏకంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆవరణలోకి చిరుత ప్రవేశించడం స్థానికులతో పాటు వాకర్స్‌ను సైతం ఆందోళనకు గురిచేస్తుంది.