గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 డిశెంబరు 2024 (13:03 IST)

సంధ్య థియేటర్ తొక్కిసలాట : సీన్ రీకన్‌స్ట్రక్షన్ యోచనలో పోలీసులు...

sandhya theater
'పుష్ప-2' చిత్రం ప్రీమియర్ ప్రదర్శన సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయాలన్న ఆలోచనలో హైదరాబాద్, చిక్కడపల్లి పోలీసులు ఉన్నారు. ఈ తొక్కిసలాట కేసులో హీరోఅల్లు అర్జున్ ఏ11 నిందితుడుగా ఉన్న విషయం తెల్సిందే. ఈ కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేయగా, ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 
 
ఇదిలావుంటే, ఈ కేసు విచారణలో అల్లు అర్జున్‌కు పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చారు. దీంతో అల్లు అర్జున్ మంగళవారం ఉదయం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఆయనతో పాటు ఆయన తండ్రి, సినీ నిర్మాత అల్లు అరవింద్, మామ రాజశేఖర్ రెడ్డి, సినీ నిర్మాత బన్నీవాసులు కూడా ఠాణాకు వచ్చారు. 
 
అల్లు అర్జున్‌ను డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, సెంట్రల్ జోన్ పోలీసు అధికారులు ప్రశ్నిస్తున్నారు. బన్నీ ముందు 50 ప్రశ్నలను ఉంచినట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ తరపు న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ జరుగుతుంది. దీంతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌ చుట్టుపక్కల భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 
 
మరోవైపు, ఈ నెల 4వ తేదీ అర్థరాత్రి సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయాలన్న ఆలోచనలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది. రాత్రి 9.30 గంటల నుంచి అల్లు అర్జున్ నుంచి వెళ్లిపోయే వరకు ఏం జరిగిందనే సమాచారాన్ని సీన్ రీ‌కన్‌స్ట్రక్షన్ ద్వారా పోలీసులు రాబట్టాలన్నారు.