బుధవారం, 19 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 మార్చి 2025 (10:49 IST)

హైదారాబాద్ నెక్లెస్ రోడ్డు రైల్ కోచ్ రెస్టారెంట్.. బిర్యానీలో బొద్దింక.. వీడియో వైరల్

Cockroach in biryani
Cockroach in biryani
హైదారాబాద్ నెక్లెస్ రోడ్డులో ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన ఓ కస్టమర్‌ షాకయ్యాడు. అతడు ఆర్డర్ చేసిన బిర్యానీలో బొద్దింక వుండటం చూసి ఖంగుతిన్నాడు. వివరాల్లోకి వెళితే.. విజయ్‌ అనే వ్యక్తి ఫ్రెండ్స్‌తో కలిసి రైల్ కోచ్ రెస్టారెంట్‌కి వెళ్లాడు. బిర్యానీ ఆర్డర్‌ చేసి తింటుండగా.. రైస్‌‌లో బొద్దింకను చూసి కంగుతిన్నాడు. 
 
రైల్ కోచ్ రెస్టారెంట్‌లోని ఫుడ్‌లో బొద్దింకలు రాజ్యమేలుతున్నాయి. ఈ విషయంపై నిర్వహకులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు  వాపోయాడు. బాధితుడు ఫుడ్‌ సెఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. నాణ్యత పాటించని హోటళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
 
ఇంకా బిర్యాలో బొద్దింక కనిపించిన ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చూడటానికి వెరైటీగా ఉందని నెక్లస్​ రోడ్​లోని రైల్​ కోచ్​ రెస్టారెంట్​కు వెళ్తే.. ఆస్పత్రిలో బెడ్​ బుక్​ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుదని నెటిజన్లతో పాటు కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.