బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 అక్టోబరు 2024 (21:49 IST)

గంజాయి మత్తు.. పెట్రోల్ బంకుకు నిప్పు పెట్టిన ఆకతాయిలు.. ఏమైంది? (video)

Nacharam
Nacharam
తెలంగాణలో గంజాయి నియంత్రణకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నా.. గంజాయిని వాడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. డ్రగ్స్ నియంత్రణ కోసం ఎన్ని తనిఖీలు చేసినా.. డ్రగ్స్, మత్తు మందులు వాడకం తగ్గట్లేదు. ఇక్కడో వ్యక్తి గంజాయి మత్తులో పెట్రోల్ బంకుకు నిప్పు పెట్టారు. 
 
నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మల్లాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నాచారం మల్లాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో.. పెట్రోల్ పడుతుండగా గంజాయి మత్తులో వున్న ఆకతాయిలు నిప్పు పెట్టారు. 
 
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. అందరూ షాకయ్యారు. దీంతో అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది నిప్పును ఆర్పేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని యువకులను అదుపులోకి తీసుకున్నారు.