1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (11:42 IST)

భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం జాతర

medaram
మేడారం జాతర భక్తులతో కిటకిటలాడుతోంది. జై సమ్మక్క అంటూ మేడారం పరిసరాలు మార్మోగిపోయాయి. మేడారం మహా జాతరలో గురువారం సాయంత్రం సమ్మక్క ప్రతిరూపాన్ని మేడారంలోని చిలకలగుట్ట నుంచి కిందికి దించారు. చిలకలగుట్ట దిగిన సమ్మక్క గద్దెల వద్దకు బయలుదేరింది. సమ్మక్కకు స్వాగతం పలుకుతూ దారిపొడవునా అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. 
 
మేడారంలో వనం వీడి జనం మధ్యలోకి వచ్చిన సమ్మక్కకు మంత్రి సీతక్క ఘనంగా స్వాగతం పలికారు. ఎస్పీ శబరీశ్ గాల్లోకి కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో సమ్మక్కకు స్వాగతం పలికారు. సమ్మక్కను గురువారం రాత్రి గద్దెలపై ప్రతిష్ఠించారు. 
 
మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వలేమని, దేశంలోని ఏ ఆలయానికి కానీ, జాతరకు కానీ అలాంటి హోదా ఇవ్వలేదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇటీవల కొన్ని పత్రికలు, సోషల్‌ మీడియాలో అనేక రకాల ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మేడారం జాతరలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం కృషి చేస్తోందని పేర్కొన్నారు.