బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 ఫిబ్రవరి 2024 (10:26 IST)

కండోమ్ పాలిటిక్స్.. భవిష్యత్తుకు గ్యారంటీ.. చీదరించుకుంటున్న ప్రజలు

Andhra Pradesh condom Politics
Andhra Pradesh condom Politics
నిరాధార ఆరోపణలు, విమర్శలు, వ్యక్తిగత దూషణలను దాటి రాష్ట్ర రాజకీయాలు మరింత దిగజారాయి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆయా పార్టీలు మరీ చీప్‌గా ప్రవర్తిస్తున్నాయి. మొన్నటివరకు బ్యానర్ల ద్వారా, పార్టీ కండువాలు, టీ షర్టుల ద్వారా బొట్టు బిల్లల ద్వారా ప్రచారాలు జరగగా, ఇప్పుడు ఏకంగా కండోమ్ పాకెట్ల ద్వారా ప్రచారాలు జరుగుతున్నాయి. 
 
అమ్మవడి పథకానికి పిల్లల్ని తగ్గించడానికి టీడీపీ వాళ్లు టీడీపీ భవిష్యత్తుకు భరోసా పేరుతో ఇంటింటికీ కండోమ్స్ పంచుతున్నారంటూ వైసీపీ పార్టీ వాళ్లు ప్రచారం చేయగా, అది సోషల్ మీడియా తెగ వైరల్ అయ్యింది. 
 
'భవిష్యత్తుకు గ్యారంటీ' పేరుతో టీడీపీ నేతలు, 'సిద్ధం' సభల పేరుతో వైసీపీ నాయకులు కండోమ్ ప్యాకెట్లు పంచుతున్నారంటూ ఇరు పార్టీలు ఎక్స్‌లో పోస్టులు చేశాయి. దీంతో ఇంతటి చిల్లర రాజకీయాలు అవసరమా? అని నెటిజన్లు ఫైరవుతున్నారు.