హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌ల్లా మొబైల్ స్నాచింగ్- నలుగురి అరెస్ట్
చైన్ స్నాచింగ్‌ల్లా ప్రస్తుతం మొబైల్ స్నాచింగ్‌లు పెరిగిపోయాయి. చేతిలో మొబైల్ ఫోన్ వుంటే చాలు.. దాన్ని పక్కా ప్లాన్‌తో లాక్కెళ్లే దొంగల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా హైదరాబాదులో చోరీలకు పాల్పడుతున్న నలుగురిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, నాలుగు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన వ్యక్తులు స్టీవ్ జాసన్ (19), వేముల సాయి సంతోష్ (19), ఓర్సు గణేష్ అలియాస్ ఘని (19)లుగా గుర్తించారు. స్టీవ్ జాసన్ గతంలో గోపాలపురంలో ఓ కేసులో చిక్కుకున్నాడు. వీరిపై ఇప్పటికే కేసులున్నారు. వీరు ఖర్చుల కోసం బైక్‌లు దొంగిలించడంతోపాటు మొబైల్ ఫోన్లు లాక్కునేవారు. ఎత్తుకెళ్లిన మొబైల్స్‌ను సంతోష్, గణేష్‌లకు విక్రయించేవారు.
జూన్ 25న సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ హైస్కూల్ వద్ద రైడ్ కన్ఫర్మేషన్ కోసం ఓ కస్టమర్ క్యాబ్ పక్కన మొబైల్‌ని చూస్తుండగా, ఇద్దరూ బైక్‌పై అతని వద్దకు వచ్చి, మొబైల్ లాక్కొని అక్కడ నుండి వేగంగా పారిపోయారు. దీనిపై సదరు కస్టమర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.