మంగళవారం, 12 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 అక్టోబరు 2024 (10:34 IST)

ఆస్పత్రిలో చేరిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత.. ఎందుకో తెలుసా?

Kavitha
బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్నప్పుడు కవితకు గైనిక్‌ సమస్యలు వచ్చాయి. అప్పట్లో ఆమె చికిత్స తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి మంగళవారం ఆస్పత్రిలో చేరారు. 
వైద్య పరీక్షల కోసం ఆమె చేరినట్లు బీఆర్ఎస్‌ వర్గాలు తెలిపాయి. సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తికానున్నాయి.

ఇక లిక్కర్ స్కామ్‌ కేసులో ఐదు నెలల పాటు జైలులో గడిపిన తర్వాత సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడంతో కవిత ఇటీవలే జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అప్పటి నుంచి ఆమె ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంటికే పరిమితం అయ్యారు.