బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (08:02 IST)

గణేశ్ నిమజ్జనం- గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి (video)

khairatabad
khairatabad
గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 17,18 తేదీలలో మద్యం దుకాణాలు బంద్ చేయాలని నగర సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 
 
అలాగే నవరాత్రులు ఘ‌నంగా పూజలు అందుకున్న ఖైరతాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. ఈ గ‌ణేశుడి శోభాయాత్ర ప్రారంభ‌మైంది. రెండున్నర కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగనుంది. 
 
టెలిఫోన్‌ భవన్‌, సెక్రటేరియట్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా సప్తముఖ మహాగణపతి ట్యాంక్‌బండ్‌ చేరుకుంటాడు. మధ్యాహ్నం ఒకటి, రెండు గంటల లోపు నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మహాగణపతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.