బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2024 (15:26 IST)

వందే భారత్ రైలులో భజన చేస్తూ తిరుపతికి వెళ్లిన బీజేపీ మహిళా నేత! (Video)

madhavilatha
వందే భారత్ రైలులో భజన చేస్తూ సికింద్రాబాద్ నుంచి తిరుపతికి బీజేపీ మహిళానేత మాధవీలత బయలుదేరి వెళ్లారు. గురువారం తిరుపతికి బయలుదేరిన ఆమె.. రైలు ఈ చివర నుంచి ఆ చివరి వరకు భజన చేస్తూ తిరిగారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఆమె వెంట పలువురు అనుచరులు కూడా ఉన్నారు. సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ రైలంతా మాధవీలత భజనతో మార్మోగిపోయింది. దాదాపు ఓ కంపార్ట్‌‍మెంట్ మొత్తం మాధవీలత వర్గంతో నిండిపోయింది. ఆమె కాసేపు హరే రామ హరే కృష్ణా, గోవిందా గోకుల నందా అంటూ భజన కూడా చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేతిలో ఓడిపోయిన విషయం తెల్సిందే.