సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 అక్టోబరు 2024 (10:28 IST)

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి దారుణ హత్య

murder
జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడి దారుణ హత్య సంచలనం రేపింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కుడి భుజం లాంటి జాప్తాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మారు గంగారెడ్డి హత్యకు గురయ్యారు. 
 
మంగళవారం ఉదయం పక్కా ప్రణాళిక ప్రకారం గంగారెడ్డిని హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. ముందుగా నిందితులు కారులో వచ్చి మృతుడిని ఢీకొట్టి ఆపై విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి హతమార్చి వేరే కారులో పరారయ్యారు. 
 
తీవ్రగాయాల పాలైన గంగారెడ్డిని ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వైఫల్యం వలన గంగారెడ్డి హత్య జరిగిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాత బస్టాండ్ చౌరస్తా వద్ద గ్రామస్తులతో కలిసి నిరసనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.