మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 అక్టోబరు 2024 (12:07 IST)

శ్రీవారి వీఐబీ బ్రేక్ దర్శన టిక్కెట్లు .. వైకాపా ఎమ్మెల్సీపై కేసు

venkateswara swamy
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లను అధిక ధరకు విక్రయించినందుకుగాను వైకాపా ఎమ్మెల్సీ జికియా ఖానంపై తిరుపతి రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీవారి దర్శన టికెట్ల విషయంలో మోసం చేశారంటూ బెంగుళూరుకు చెందిన భక్తులు ఒకరు ఫిర్యాదు చేశారు. ఆరు వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లకు రూ.65 వేలు వసూలు చేశారని పేర్కొన్నాడు. 
 
బెంగుళూరు భక్తులను తన లేఖ ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనానికి జికియా ఖానం సిఫార్సు చేశారు. అధిక ధరకు టిక్కెట్లు అమ్ముతున్నట్టు భక్తుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్సీ పాటు ఆమె పీఆర్వో కృష్ణతేజ, చంద్రశేఖర్‌పై కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికే గత వైకాపా నేతలు శ్రీవారి వీఐపీ దర్శన బ్రేక్ టిక్కెట్లను అడ్డగోలుగా విక్రయించి భారీగా వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే.