ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

తెలంగాణాలో లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీదే హవా!!

congress flag
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే - సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా చిత్తుగా ఓడుపోనుండగా, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ మరోమారు సత్తా చాటనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 17 ఎంపీ సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 10 వరకు సొంతం చేసుకుంటుందని వెల్లడైంది. అలాగే, బీఆర్ఎస్‌కు 3, బీజేపీకి 3, ఎంఐఎంకు ఒక స్థానం వస్తుందని పేర్కొంది. 
 
గత 2019లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం మూడు ఎంపీ సీట్లు మాత్రమే రాగా, బీఆర్ఎస్‌కు తొమ్మిది, భారతీయ జనతా పార్టీకి నాలుగు, మజ్లీస్ పార్టీకి ఒక్క సీటు వచ్చింది. ఈ దఫా మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో తన స్థానాల సంఖ్యను రెండు అంకెలకు పెంచుకోనుంది. 
 
కాగా, ఈ సర్వేను మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో 35801 శాంపిల్స్‌ను సేకరించింది. ఈ పోల్ డిసెంబరు 2023 డిసెంబరు నుంచి 2024 జనవరి 28వ తేదీ మధ్య నిర్వహించారు. ఈ శాంపిల్స్ ఆధారంగా కాంగ్రెస్ పార్టీకి 41.2శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. అయితే, గత 2019లో ఈ పార్టీకి కేవలం 29.8 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత భారాసకు 29.1 శాతం, బీజేపీకి 21.1 శాతం వస్తాయని పేర్కొంది.