గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 డిశెంబరు 2024 (10:58 IST)

జూనియర్ కొరియోగ్రాఫర్‌పై జానీ మాస్టర్ లైంగికదాడి నిజమే : పోలీసుల చార్జిషీట్

Jani Master
జూనియర్ కొరియోగ్రాఫర్‌పై కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగికదాడి చేసింది నిజమేనని పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‍‌లో పేర్కొన్నారు. ఈ మేరకు నార్సింగి పోలీసులు హైదరాబాద్ కోర్టులో చార్జిషీటును దాఖలు చేశారు. ఈ చార్జిషీటుపై జానీ మాస్టర్ స్పందించారు. న్యాయస్థానం మీద తనకు నమ్మకం ఉందని, నిర్దోషిగా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు జానీ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేశారు.
 
'ఈ కేసులో ఏం జరిగిందనేది నా మనసుకు, దేవుడికి తెలుసు. ఏదైనా న్యాయస్థానం నిర్ణయిస్తుంది. నేను క్లీన్‌చిట్‌తో బయటకు వస్తా. అప్పుడే మాట్లాడుతా. అప్పటివరకు నేను నిందితుడిని మాత్రమే. అభిమానుల ప్రేమ నాపై ఎప్పుడూ ఉండాలి' అని వీడియోలో జానీ మాస్టర్ పేర్కొన్నారు.
 
కాగా, తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ లేడీ కొరియోగ్రాఫర్ సెప్టెంబరు 15వ తేదీన నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు జానీ మాస్టరుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆయనను అరెస్టు చేశారు. 
 
ఆ తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో అక్టోబర్ 25న చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. అటు లైంగిక వేధింపుల కేసు కారణంగా జానీ మాస్టర్ నేషనల్ అవార్డును సైతం కోల్పోయిన విషయం తెలిసిందే.