బాబూ గారూ రండి.. మాట్లాడుకుందాం... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
తెలుగు రాష్ట్రాల విభజన అనంతర సమస్యల పరిష్కారానికి ఇరువురు ముఖ్యమంత్రుల ముఖాముఖి చర్చకు వేదికగా, జూలై 6న జరగనున్న సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రతిపాదనను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
జూలై 1న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖకు ప్రతిస్పందనగా, రేవంత్ రెడ్డి 'జూలై 6 మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతి రావు ఫూలే భవన్‌లో సమావేశం కోసం ఆయనను ఆహ్వానించారు.
ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తూ రేవంత్ రెడ్డికి నాయుడు లేఖ రాశారు. ఈ లేఖను రేవంత్ రెడ్డి అంగీకరించారు. బాబు సమావేశానికి ఓకే చెప్పారు.
ఇంకా ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించినందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. "స్వతంత్ర భారతదేశంలో నాల్గవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చాలా అరుదైన రాజకీయ నాయకుల జాబితాలో మీరు చేరారు. మీకు శుభాకాంక్షలు" అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.