గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2023 (15:46 IST)

ఎంపీ పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి... పలువురు ఎంపీల అభినందన

revanth reddy
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చిన రేవంత్ రెడ్డి.. ఆ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి బుధవారం కాంగ్రెస్ పెద్దలను కలుస్తూ, గురువారం జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఆయన తన లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందిన విషయం తెల్సిందే. ఇపుడు కొడంగల్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 
 
దీంతో ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయన బుధవారం లోక్‌సభ సచివాలయానికి వెళ్లి తన రాజీనామా లేఖను స్పీకర్‌కు అందచేస్తారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాలకు హాజరైన పలువురు ఎంపీలు రేవంత్‌ రూం నెంబర్ 66లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని పలువురు ఎంపీలు అభినందిస్తూ, శుభాకాంక్షలు తెలిపారు.