Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠాలు అర్థం కావడం లేదని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 12 అక్టోబరు 2025 (10:56 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు అర్థం కాకపోవడంతో బలవన్మరణానికి పాల్పడింది. రాష్ట్రంలోని ఎల్కతుర్కి మండలం గోపాల్ పూర్‌లో ఈ ఘటన జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. గోపాల్‌పూర్‌ గ్రామానికి చెందిన కృష్ణాకర్‌కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. చిన్న కుమార్తె జె.కీర్తన (19) హైదరాబాద్‌లోని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. అధ్యాపకులు చెప్పిన పాఠాలు అర్థం కావటం లేదని, తల్లిదండ్రులకు దూరంగా ఉండలేక పోతున్నానని ఫోన్‌ చేసి బాధపడేది. 
 
దీంతో ఆమెను ఇంటికి రప్పించి, వేరే కళాశాలలో చేర్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అంతలో ఏమైందో.. ఈ నెల 10న శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొంది. తర్వాత ఇంటికి వచ్చిన తండ్రి కృష్ణాకర్‌ గమనించి వెంటనే కిందకు దించి గ్రామంలోని ఆర్‌ఎంపీని పిలిపించి పరీక్షించగా.. అప్పటికే మృతి చెందింది. శనివారం తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 
 

అన్నీ చూడండి

Prakash Raj: డార్లింగ్ కృష్ణ, ప్రకాష్ రాజ్ సినిమా ఫాదర్ టీజర్ రిలీజ్

king 100: నాగార్జున పుట్టినరోజు న కింగ్ 100 మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

Mandadi teaser: విజువల్స్, బోట్ సీక్వెన్స్ తో సుహాస్, సూరి ల మండాడి టీజర్

Taapsee Pannu : అప్పుడే మేము దానిని వేడుకలా జరుపుకుంటాం : తాప్సీ పన్ను

ప్రియదర్శి.. ఇడుపు కాయితం నుంచి శ్రీలత సాంగ్ ప్రోమో రిలీజ్

తర్వాతి కథనం
Show comments