శుక్రవారం, 28 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 27 నవంబరు 2025 (20:56 IST)

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

Jagadish Reddy
కోనసీమ కొబ్బరిచెట్లకు దిష్టి తగిలిందంటూ తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ... ఆంధ్రోళ్లే తెలంగాణలోని హైదరబాదును చూసేందుకు వస్తుంటారు. మా దిష్టి కాదు, ఇన్నేండ్లు వారి దిష్టే మా తెలంగాణకు తగిలింది. మైండ్ లెస్ మాటలు మాట్లాడేవారు కూడా ఉపముఖ్యమంత్రులవుతున్నారు. అలాంటివారు చేసే వ్యాఖ్యలపై మనం ఏం చేస్తాం అంటూ చెప్పారు. 
 
ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ... కోనసీమ కొబ్బరిచెట్లు మొండేలతో వున్నాయంటే ఎంతోమంది దిష్టి తగలడమే అన్నారు. తెలంగాణ నాయకులు కోనసీమ కొబ్బరిచెట్లతో పచ్చదనంతో ఆనందంగా వుంటారని అంటుంటారు. అలాంటి కోనసీమ పచ్చదనం ఇవాళ ఇలా తయారైందంటే ఎంతోమంది దిష్టి పెట్టారని అన్నారు.