సోమవారం, 16 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 డిశెంబరు 2024 (15:48 IST)

మోహన్ బాబును అరెస్టు చేస్తాం : రాచకొండ సీపీ వెల్లడి (Video)

mohan babu
సినీ నటుడు మోహన్ బాబుకు తాము ఇచ్చిన నోటీసులపై స్పందించకుంటే అరెస్టు చేస్తామని హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు స్పష్టం చేశారు. మోహన్ బాబు విషయంలో అంతా చట్ట ప్రకారమే జరుగుతుందని, అరెస్టు విషయంలో ఆలస్యం లేదని ఆయన వివరించారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని చెప్పారు. మోహన్ బాబును విచారించేందుక వైద్య నివేదిక తీసుకోవాల్సి వుందన్నారు. 
 
కాగా, మోహన్ బాబుకు తాము ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, అయితే, ఆయన ఈ నెల 24వ తేదీ వరకు సమయం అడిగారని సీపీ చెప్పారు. కోర్టు కూడా ఆయనకు సమయం ఇచ్చిందన్నారు. 24వ తేదీ తర్వాత నోటీసులకు స్పందించకపోతే మోహన్ బాబును అరెస్టు చేస్తామని తెలిపారు. 
 
మోహన్ బాబు ఉన్న లైసెన్స్ గన్స్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో లేవని, ఆయన వద్ద ఉన్న గన్స్‌‍ను చిత్తూరు జిల్లా చంద్రగిరిలో డిపాజిట్ చేశారని చెప్పారు. తాను దాడి చేయడంతో జర్నలిస్టు గాయపడ్డారని, అందుకే ఆయనను పరామర్శించేందుకు మోహన్ బాబు ఆస్పత్రికి వెళ్లివుంటారని సీపీ సుధీర్ బాబు తెలిపారు.