Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఆరు నెలలు 13 ప్యాసింజర్‌ రైళ్లు రద్దు

Written By ఎం
Updated: శనివారం, 14 డిశెంబరు 2019 (09:55 IST)
నిర్వహణా పనులు, భద్రత కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఆరు నెలల పాటు 13 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనవరి 1 నుంచి జూన్ 30 వరకూ పలు మార్గాల్లో తిరిగే డెము రైళ్లు రద్దు కానున్నాయి.

రద్దయిన రైళ్లలో సికింద్రాబాద్‌ మేడ్చల్‌ సికింద్రాబాద్‌ డెము ప్యాసింజర్‌, ఫలక్‌ నుమా మేడ్చల్‌ ఫలక్‌నుమా డెము ప్యాసింజర్‌ , ఫలక్‌ నుమా ఉమ్దా నగర్‌ ఫలక్‌ నుమా డెము ప్యాసింజర్‌,బొల్లారం ఫలక్‌ నుమా బొల్లారం డెము ప్యాసింజర్‌ రైళ్లు ఉన్నాయి.
 
ఈ రైళ్లతో పాటు ఫలక్‌ నుమా మనోహరాబాద్‌ సికింద్రాబాద్‌ డెము ప్యాసింజర్‌,సికింద్రాబాద్‌ ఉమ్దా నగర్‌ డెము ప్యాసింజర్‌ , ఉమ్దా నగర్‌ ఫలక్‌ నుమా ఉమ్దా నగర్‌ డెము ప్యాసింజర్‌, ఫలక్‌ నుమా భువనగరి ఫలక్‌ నుమా ప్యాసింజర్‌ రైళ్లు ఆరు నెలల పాటు నిలిచిపోనున్నాయి.

ఇదే సమయంలో కొన్ని రైళ్లను పాక్షికంగానూ రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. డిసెంబర్ 16 నుంచి మార్చి 15 వరకూ బోధన్‌ మహబూబ్‌ నగర్‌ ప్యాసింజర్‌ షాద్ నగర్ వరకు మాత్రమే నడుస్తుంది. మహబూబ్‌ నగర్‌ కాచిగూడ ప్యాసింజర్‌ రైలు కూడా షాద్‌ నగర్‌ వరకే నడుపనుంది. మేడ్చల్‌ కాచిగూడ ప్యాసింజర్‌ ను మేడ్చల్, బొల్లారం మధ్య రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

అన్నీ చూడండి

Allari Naresh: రంభ ఊర్వశి మేనక నుంచి బ్యాడ్ టైం బ్యాండ్ బాజా సాంగ్

Venkatesh : కింగ్డమ్ ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా అనౌన్స్ మెంట్

Jyothi Poorvazh: జ్యోతి పూర్వజ్.. కిల్లర్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్

Venky Atluri :సూర్య గారిని దృష్టిలో ఉంచుకొని కథ రాయలేదు : వెంకీ అట్లూరి

అమీర్ లోగ్ కథ ఇప్పటి వరకు రాలేదు, హిట్టు బొమ్మ.. రమణా రెడ్డి సోమ

తర్వాతి కథనం
Show comments