సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2019 (08:09 IST)

ప్రియుడి కోసం అమ్మాయి ఏం చేసిందో చూడండి

ఇరాక్‌ వేదికగా తెలంగాణ అబ్బాయి, నేపాల్‌ అమ్మాయి ప్రేమించుకున్నారు. ఐదేళ్లు అక్కడే కలిసి కాపురం చేశారు. చుట్టీ మీద ఇంటికి వెళ్తున్నానని చెప్పి ప్రియుడు ఇండియాకు చేరాడు.

ఫోన్‌ నంబరు మార్చడంతో మోసపోయానని గ్రహించిన సదరు యువతి ఇరాక్‌ నుంచి నేరుగా వెల్గటూరు చేరుకుని స్థానిక పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన అల్లె చంద్రశేఖర్‌ బతుకుదెరువుకు ఐదేళ్ల క్రితం ఇరాక్‌వెళ్లాడు. నేపాల్‌కు చెందిన లలితఅన్నా సైతం ఉపాధి నిమిత్తం ఇరాక్‌కు వెళ్లింది. అక్కడ ఇద్దరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఐదేళ్లు కలిసికాపురం సైతం చేశారు.
 
అక్టోబర్‌లో చంద్రశేఖర్‌ చుట్టీమీద స్వగ్రామం వెంకటాపూర్‌ వచ్చాడు. కొద్దిరోజులు ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు. తరువాత చంద్రశేఖర్‌ ఫోన్‌ నంబర్‌ మార్చివేశాడు. లలితకు చాలారోజుల నుంచి ఫోన్‌ చేయకపోవడంతో తనవద్ద ఉన్న రాజశేఖర్‌ ఓటర్‌ ఐటీ ఆధారంగా శనివారం వెల్గటూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది.

చంద్రశేఖర్‌ తనకు పెళ్లి కాలేదని చెప్పి ప్రేమపేరుతో లోబర్చుకున్నాడని, అతడికి పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసి మోసపోయాయని వాపోయింది. పోలీసులే తనకు న్యాయం జరిగేలా చూడాలని లలిత వేడుకుంటోంది.