బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2019 (20:45 IST)

నిర్మాలా సీతారామన్ తో టి ఆర్ ఎస్ ఎంపీలు భేటి

జీఎస్టీ బకాయిలు, రాష్ర్టానికి రావాల్సిన నిధులతో పాటు తదితర అంశాలపై కేంద్ర మంత్రి  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తో టీఆర్‌ఎస్‌ ఎంపీలు చర్చించారు.

ఢిల్లీలోని ఆర్థిక మంత్రిత్వ కార్యాలయంలోఎంపిల బృందం కలిసింది.. ఈ సందర్భం గా జీఎస్టీ బకాయిలు త్వరగా విడుదల చేయాలని ఎంపీలు కేంద్ర మంత్రిని కోరారు. కేంద్ర మంత్రిని కలిసిన అనంతరం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు మీడియాతో మాట్లాడుతూ, . రాష్ర్టానికి రావాల్సిన నిధులపై సీఎం కేసీఆర్‌ లేఖను కేంద్ర మంత్రి కి అందజేశామని   తెలిపారు.

ఐజీఎస్టీ నిధులు రూ. 4,531 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరామని అన్నారు.  విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాలకు రూ. 450 కోట్లు రావాలని, . స్థానిక సంస్థలకు రూ. 312 కోట్లు రావాల్సి ఉందని, అలాగే . మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ చెప్పిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

మిషన్‌ భగీరథకు రూ. 19,205 కోట్లు, కాకతీయకు రూ. 5 వేల కోట్లు అడిగామని,  గిరిజన యూనివర్సిటీకి రూ. 450 కోట్లు విడుదల చేయాలని కోరామన్నారు.. నిధుల ఆలస్య ప్రభావం రాష్ట్ర అభివృద్ధి పనులపై పడుతుందని,   ఇతర పార్టీలకు చెందిన తెలంగాణ  ఎంపీలు కూడా నిధులు వచ్చేలా సహకరించాలి అని ఎంపీ నామా నాగేశ్వర్‌రావు కోరారు.