నార్సంగిలో కరోనా కలకలం: 25మంది విద్యార్థులకు పాజిటివ్
హైదరాబాద్ శివారులోని నార్సింగిలో కరోనా కలకలం రేపింది. ఒకే కాలేజీలో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.
వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్న విద్యార్థులు గత రెండ్రోజులుగా తీవ్ర చలి జ్వరంతో బాధపడుతున్నారు. వీరికి కరోనా నిర్ధారణలు పరీక్షలు చేయించగా వారిలో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది.
కాలేజీలో 25 మందికి కరోనా సోకినట్లు తేలడంతో విద్యార్థులు భయ భయభ్రాంతులకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే నార్సింగి మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు.. కాలేజీ మొత్తం శానిటైజేషన్ చేశారు. మిగతా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.