మాటలు కలిపిన యువకుడితో వివాహేతర సంబంధం, ఆపై భర్తను హత్య చేసి...

murder
జె| Last Modified బుధవారం, 13 జనవరి 2021 (13:04 IST)
కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లిలో సత్యనారాయణ, గౌతమిలు నివాసముండేవారు. వీరికి వివాహం జరిగి పది సంవత్సరాలు అవుతున్నా ఇంకా పిల్లలు లేరు. సత్యనారాయణ ప్రొవిజన్ షాప్ ఓనర్. రెండు చేతులా బాగా సంపాదిస్తున్నాడు. అయితే సంపాదన కన్నా పిల్లలు లేరన్న లోటు గౌతమిలో ఎక్కువగా కనిపించేది.

దీంతో ఒంటరిగా ఫీలవుతూ వచ్చింది. అయితే సత్యనారాయణ తరచూ మద్యం సేవించి ఇంటికి అర్థరాత్రి వచ్చేవాడు. ఈ విషయంపైనే భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇదిలా జరుగుతుండగానే రెండు నెలల క్రితం వీరి ఇంటికి ఒక యువకుడు అద్దెకు వచ్చాడు.

అతని పేరు యశ్వంత్. అందంగా కూడా ఉన్నాడు. ఒంటరిగా ఉన్న గౌతమితో అతడు మాటలు కలిపాడు. ఖాళీగా ఉన్న సమయంలో యశ్వంత్ గదికి వెళ్ళి పిచ్చాపాటీ మాట్లాడుతూ ఉండేది. మొదటిసారి యువకుడితో మనసు విప్పి మాట్లాడేసింది గౌతమి. నువ్వంటే నాకిష్టం. అయితే నేను నీ దాన్నే.

నేను చెప్పినట్లు వింటావా అంటూ అతన్ని దగ్గర తీసుకుని శారీరకంగా కలిసింది. దాంతో ఆ యువకుడు ఆమెకు బాగా కనెక్ట్ అయ్యాడు. నా భర్తతో బాగా విసిగిపోయాను. నేను నీకు సొంతం కావాలన్నా.. ఆస్థి మొత్తం మనకే దక్కాలన్నా నా భర్త సత్యనారాయణను చంపేద్దామంటూ చెప్పింది.

నువ్వే ఈ పనిచేయాలంటూ ప్రాధేయపడింది. ఆంటీ ఏది చెబితే అది వింటూ తలూపిన యశ్వంత్ తన స్నేహితుడి సహాయంతో సత్యనారాయణను ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్ళాడు. అందరూ కలిసి మద్యం పార్టీకి కూర్చున్నారు. సత్యనారాయణకు మోతాదుకు మించి తాగించి స్పృహ కోల్పోయిన తరువాత బండ రాయి తీసుకుని ఇద్దరూ కలిసి చంపేశారు.

ఆ తరువాత మృతదేహాన్ని పక్కనే ఉన్న కాలువలో పడేశారు. పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులుదీనిపై మరింత చదవండి :