Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

భార్య ముందే ప్రియురాలికి వీడియో కాల్స్, భరించలేని ఆమె...

Written By ఐవీఆర్
Updated: శుక్రవారం, 26 జూన్ 2020 (20:20 IST)
ప్రేమించానంటూ వెంటపడి మరీ పెళ్లి చేసుకున్నాడు. మోజు తీరాక ఎంతో ఇష్టపడి చేసుకున్న భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. పరాయ స్త్రీల మోజులో పడి కట్టుకున్న భార్య ముందే వారికి వీడియో కాల్స్ చేస్తూ ఆమెను మనోవ్యధకు గురిచేశాడు. భర్త మారతాడని ఎన్నో చిత్రహింసలు భరించిన ఆ బాధితురాలు చివరికి తన బాధను ఓ వీడియో ద్వారా చెప్పి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేష్ చౌదరి బాధితురాలు లావణ్య వెంటపడి ప్రేమిస్తున్నానని ఆమెను బ్రతిమాలాడి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యాక అతడికి జెట్‌ ఎయిర్‌వేస్‌లో పైలట్‌గా ఉద్యోగం వచ్చింది. దానితో శంషాబాద్ రాళ్గగూడలోని సీఎస్‌కె విల్లాలో కాపురం పెట్టాడు. కొద్దికాలం హాయిగా కాపురం సాగింది. ఆ తర్వాత కలతలు మొదలయ్యాయి. చీటికిమాటికి ఆమెను తిట్టడం, కొట్టడం మొదలుపెట్టాడు.
 
 ఆమె వుండగానే పరాయి మహిళలను ఇంటికి తీసుకురావడం చేశాడు. ఓ యువతితో వీడియో కాల్ చేస్తూ ఆమెతో నిత్యం తిరగడం మొదలుపెట్టాడు. దీనితో భార్య లావణ్య అతడిని ప్రశ్నించింది. అలా నిలదీసినందుకు ఆమెపై పడి గొడ్డును బాదినట్లు బాదాడు. భర్తకు ఎంత చెప్పినా అతడి ప్రవర్తినలో మార్పు రాలేదు.
 
ఓ యువతితో అక్రమ సంబంధం పెట్టుకుని హోటల్ గదిలో వుంటున్నట్లు బాధితురాలు వీడియోలో చెప్పింది. ఇక తన భర్త మారతాడని ఆశ లేదని, ఇలాంటి బ్రతుకు బతకడం వ్యర్థమంటూ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  వివాహిత ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు నిందితుడు వెంకటేష్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అన్నీ చూడండి

Aadhi Pinisetty : ఆది పినిశెట్టి మరకతమణి 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు

Tammareddy Bharadwaja: నానీస్ పేరడైజ్ చిత్రాన్ని విమర్శించిన వారిని ఘాటుగా శపించిన తమ్మారెడ్డి భరద్వాజ

Sharwanand: ముసుగు యోధుడిగా భోగి టీజర్ లో కనిపించనున్న శర్వానంద్‌

Ranabali Lunch : రణబాలి లంచ్ మీట్ - త్వరలో ట్రైలర్ తో ముందుకు వస్తున్నాం

Nagarjuna: నాగార్జున, మణిరత్నం... గీతాంజలి 4Kలో గ్రాండ్ రీ-రిలీజ్‌ కు సిద్ధం

తర్వాతి కథనం
Show comments