బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (10:43 IST)

చల్లని రాత్రులు ఇక లేవు.. తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

కొన్ని చల్లని రాత్రుల తరువాత, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కనీస ఉష్ణోగ్రత ఆదివారం పెరిగింది. హైదరాబాద్‌‌లో సోమవారం తెల్లవారుజామున సగటు కనిష్ట ఉష్ణోగ్రత 16.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇది మునుపటి రోజు కంటే కనీసం రెండు డిగ్రీలు ఎక్కువ.
 
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం (టిఎస్‌డిపిఎస్) అంచనా ప్రకారం, రాబోయే ఐదు రోజుల పాటు నగరం, పొరుగు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. హైదరాబాద్‌లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రత వరుసగా 31 డిగ్రీల సెల్సియస్ మరియు 16 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని భావిస్తున్నారు. పటాన్ చెరు, సికింద్రాబాదు, బేగంపేట వంటి కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రత ఈ వారం మూడు నుండి ఐదు డిగ్రీలు పెరగవచ్చు.
 
ఇదిలా ఉండగా, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం, ములుగులోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వరకు 4 మి.మీ వరకు వర్షపాతం నమోదైంది. రాబోయే రెండు రోజుల్లో చాలా జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రత రెండు నుండి నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.