తెలంగాణాలో మరో మంకీపాక్స్ కేసు గుర్తింపు

Written By ఠాగూర్
Updated: బుధవారం, 27 జులై 2022 (08:49 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరో మంకీపాక్స్ కేసు వెలుగు చూసింది. ఖమ్మంలో ఈ కేసును గుర్తించారు. దీంతో జిల్లా వాసుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. వైద్య వర్గాల మేరకు ఆరముంపుల ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి స్థానికంగా ఉండే గ్రానైట్ కంపెనీలు పని చేస్తున్నాడు. ఈయన గత మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరాడు. ఆ తర్వాత అతని శరీరంపై బొబ్బలు రావడాన్ని వైద్యులు గుర్తించారు. ఆ వెంటనే ఆ వ్యక్తిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
గత మూడు రోజులుగా తీవ్ర జ్వరం, శరీరంపై దద్దుర్లు రావడంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రి వైద్యులు మంకీపాక్స్‌ వైరస్‌గా ప్రాథమికంగా ఓ నిర్థారణకు వచ్చి అక్కడ నుంచి హైదరాబాద్ నగరంలోని ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. అలాగే, అతనితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించే పనిలో జిల్లా వైద్యాధికారులు నిమగ్నమయ్యారు. 

అన్నీ చూడండి

Imtiaz Ali :: మెయిన్ వాపస్ ఆవుంగా తో 59 దేశాల్లో విజయం సాధించిన మ్తియాజ్ అలీ

Ajay Bhupathi : ఆ కథను నా డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉంచుకోమని మహేష్ బాబు అన్నారు

Kajal Aggarwal: విడుదలకు ముందే చర్చకు తావిస్తున్న ది ఇండియా స్టోరీ

ఆ పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఆరోగ్యంగానే ఉన్నాను : అమితాబ్

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

తర్వాతి కథనం
Show comments