Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్చ కేజీబీవీ కాలేజీలో హాస్టల్‌లో ఫుడ్‌పాయిజన్ - ఓ విద్యార్థి పరిస్థితి విషమం

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 3 మార్చి 2023 (09:04 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లా చర్లలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేబీవీపీ)లో ఇంటర్ చదవుతున్న ఆరుగురు విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. వీరు ఆరగించిన భోజనం కలుషితం కావడంతో అస్వస్థతకు లోనైనట్టు సమాచారం. దీంతో వై.అంజలి, ఆదేశ, బి.హర్షిత, ఎం.నందిని, కె.పూజిత, కారం కృష్ణ లహరిలు అస్వస్థతకు లోనయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్న వీరిని వెంటనే స్థానిక ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ విద్యార్థులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 
 
అయితే, వీరి అస్వస్థతకు ఫుడ్‌పాయిజన్ కాదని, రక్తహీనత వల్ల ఇలా జరిగివుంటుందని వైద్యులు అంటున్నారు. కాగా, ఈ ఐదుగురు విద్యార్థినిలను మెరుగైన వైద్య కోసం భద్రాచలం ఆస్పత్రికి తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అయితే, బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఫుడ్‌‍పాయిజన్ కారణంగానే ఇలా జరిగివుంటుందని ఆరోపిస్తున్నారు. వీరంతా ఇంటి నుంచి వచ్చారని, ప్రయోగ పరీక్షల నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికిగురై ఉంటారని ఎస్.వో. సరోజిని ఆరోపించారు. 

అన్నీ చూడండి

Senior Naresh: 55 ఏళ్ల సినీ జర్నీ చేస్తున్న డా. నరేష్ విజయకృష్ణకు గోవా గవర్నర్ ఘన సత్కారం

Kamal Haasan: రశ్మికను చూస్తే అసూయ లేదు. గడ్డం తీసినా నేను పాత్రలో మెప్పించలేను : కమల్ హాసన్

Pa Ranjith: విభిన్న కాలమానాలతో పా రంజిత్ చిత్రం వరల్డ్ ఆఫ్ వెట్టువం

Disco Santhi: ఆసుపత్రి నుంచి శాంతి శ్రీహరి డిచ్చార్జ్ - మేఘాంశ్ సినిమా ఆస్మాన్ ను హిట్ చేయండి

Samantha: సమంత రూత్ ప్రభు సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ న్యాయనిర్ణేతగా ఆస్ట్రేలియా చెఫ్ శశి చెలియా

తర్వాతి కథనం
Show comments