గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 7 ఆగస్టు 2020 (20:37 IST)

బిగ్ బాస్ ఫేం ప్రిన్స్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హీరో, బిగ్ బాస్ ఫేం ప్రిన్స్ మొక్క‌లు నాటారు.

అనంతరం మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో పాటు సీడ్ గణేష్ అనే కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని సినీ హీరో ప్రిన్స్ అన్నారు.

చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒకడిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని హీరో ప్రిన్స్  అన్నారు.

కమెడియన్ ఖ‌య్యుం విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ కూకట్ పల్లి  ప్రగతి నగర్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం హీరో నాని, భీష్మ సినిమా డైరెక్టర్ వెంకీ కుడుముల, నటుడు అరుణ్ ఆదిత్ లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.