శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 డిశెంబరు 2022 (10:25 IST)

ప్రజా సంగ్రాయ యాత్రకు నేటితో పరిసమాప్తం... భారీ బహిరంగ సభ

bandi sanjay
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర గురువారంతో ముగియనుంది. దీన్ని పురస్కరించుకుని భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇందులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొని ప్రసంగిస్తారు. 
 
ఇందుకోసం జేపీ నడ్డా గురువారం మధ్యాహ్నం 2.10 గంటలకు హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి 3.30 గంటలకు కరీంనగర్‌కు వస్తారు. 3.40 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. సభలో ప్రసంగించిన తర్వాత కరీంనగర్ నుంచి బయల్దేరి హైదరాబాద్ నగర్‌కు చేరుకుంటారు. 
 
సాయంత్రం 5.35 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళతారు. గత నెల 28వ తేదీ నిర్మల్ జిల్లా భైంసాలో బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమైంది. 18 రోజుల పాటు ఐదు జిల్లాల్లో 222 కిలోమీటర్ల మేరకు యాత్ర కొనసాగింది. నిర్మల్, ఖానాపూర్, వేములవాడ, జగిత్యాల, చొప్పదండి, ముథోల్, కరీంనగర్ నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగింది.